తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ తో సహా యావత్తు రాష్ట్రాన్ని షాక్ కు గురిచేసిన సంఘటన షాద్ నగర్ పరిధిలో వెటర్నీ డాక్టర్ ప్రియాంక రెడ్డిని నలుగురు ఉన్మాదులు అత్యాచారం చేసి.. హత్య చేయడంతోనే కాకుండా ఏకంగా పెట్రోల్,డిజీల్ పోసి తగులబెట్టడం. ప్రస్తుతం ఈ సంఘటనపై సామాన్య ప్రజానీకం దగ్గర నుండి ప్రముఖుల వరకు ముక్త స్వరంతో ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి మహమూద్ ఆలీ మాట్లాడుతూ” డాక్టర్ ప్రియాంక రెడ్డి హాత్యను ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుంది. నిందితులకు కఠిన శిక్ష పడేలా పోలీసు యంత్రాంగం పని చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే పోలీసులు కేవలం ఇరవై నాలుగంటల్లోనే నిందితులను అరెస్టు చేసింది అని ఆయన తెలిపారు. బాధితురాలి కుటుంబ సభ్యుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులను విధుల నుంచి సస్పెండ్ చేశామని ఆయన చెప్పారు.
