టీమిండియా మాజీ కెప్టెన్,క్యాబ్ అధ్యక్షుడు,ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి బీసీసీఐ కోర్ కమిటీ బంపర్ ఆఫర్ ఇచ్చింది.బీసీసీఐ వార్షిక ఏజీఎం సమావేశంలో చైర్మన్ సౌరవ్ గంగూలీ పదవీ కాలానికి అడ్డంకిగా ఉన్న బీసీసీఐ రాజ్యాంగ నిబంధనలను సవరించినట్లు సమాచారం.
అయితే అపెక్స్ కోర్టు బీసీసీఐ ప్రతిపాదనలను ఒప్పుకుంటుందా… లేదా అని వేచి చూడాలి. ఒకవేళ బీసీసీఐ ప్రతిపాదనలను ఒప్పుకుంటే దాదానే మరో ఐదేళ్ల వరకు బీసీసీఐ అధ్యక్ష పదవీలో ఉంటాడు.
ఇందుకు తగిన బీసీసీఐ బృందం సుప్రీం కోర్టుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల మేరకు గంగూలీ వచ్చే ఏడాదినే తన పదవీకి రాజీనామా చేయాల్సి ఉంది.