భారత క్రికెట్ జట్టుకు ప్రస్తుతం ఉన్న సమస్య ఒక్కటే..అదేమిటంటే నాలుగో స్థానం కోసమే. ప్రపంచకప్ తర్వాత నుండి ఈ స్థానంపై మరింత ఆశక్తి నేలకొనింది. మరోపక్క ఈ ప్లేస్ లో రాహుల్, రాయుడు, పంత్ వంటి ఆటగాళ్ళు ఆడినప్పటికీ ఆ స్థానాన్ని భర్తీ చేయలేకపోయారు. అయితే భారత సెలక్షన్ కమిటీ చీఫ్ ఎంఎస్కే ప్రసాద్ దీనికి సరైన ప్లేయర్ శ్రేయస్ ఐయ్యర్ అని అన్నారు. అతడికి ఛాన్స్ ఇస్తే ఆ స్థానానికి న్యాయం చేస్తాడని చెప్పారు. ఐయ్యర్ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. విజయ్ హజారే ట్రోపీ, సయీద్ ముస్తాక్ అలీ ట్రోపీ లలో మంచి ఆట ఆడాడు. మరోపక్క ఇంటర్నేషనల్ జట్టులో కూడా మంచి ఆట ఆడుతున్నాడు.
