డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ హత్య రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తాన్ని తలచివేసింది. కొంత మంది మానవ మృగాలు ఆమెను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి సజీవ దహనం చేయడాన్ని యావత్ ప్రజానీకం జీర్ణించుకోలేకపోతుంది. ప్రియాంక రెడ్డి హత్యపై ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై నటి కీర్తి సురేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
డాక్టర్ ప్రియాంక రెడ్డిని రేప్ చేసి సజీవ దహనం చేశారని తెలిసి నా గుండె బద్దలైంది.. రోజు రోజుకి పరిస్థితులు మరింత భయానకంగా మారుతున్నాయి. ఇలాంటి దారుణ సంఘటన జరగడంతో నాకు ఏం మాట్లాడాలో కూడా తెలీడం లేదు. ఎవరిని నిందించాలో అర్థం కావడంలేదు అని కీర్తి ట్వీట్ చేశారు. ఒక నగరంలో ఏ సమయంలోనైనా మహిళలు స్వేచ్ఛగా సంచరించే సమయం మన దేశంలో ఎప్పుడొస్తుందోనని కీర్తి అన్నారు. అమ్మాయిలపై అఘాయిత్యాలు చేసే ప్రతి ఒక్కరిని వీలైనంత త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలి. ప్రియాంక కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఇలాంటి స్థితిలో దేవుడు వాళ్లకు శక్తి, సామర్థ్యాలను అందించాలని, నేను కర్మను కచ్చితంగా నమ్ముతానని కీర్తి తన ట్వీట్లో పేర్కొన్నారు.