చిరు ధాన్యాలతో చక్కటి ఆరోగ్యం పొందవచ్చని.. చిరుధాన్యాలు మన ఆహారంలో భాగం కావాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. చిరుధాన్యాల ఆవశ్యకతపై ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రిసెర్చ్ ఆధ్వర్యంలో నగరంలోని హెచ్‌ఐసీసీలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. పల్స్ బాస్కెట్‌ను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో చిరు ధాన్యాల పంటల సాగు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం సైతం చిరుధాన్యాల సాగు పెరిగేందుకు అన్నిరకాలుగా మద్దతు ఇస్తుందన్నారు. ఆరోగ్య రక్షణకు ప్రజలు యోగా, ప్రాణాయామం, సేంద్రీయ వ్యవసాయ పద్దతులు, రసాయనాలు వాడని ఆహారపు పంటలు వంటి వాటిపై దృష్టిసారించాలన్నారు. 40, 50 ఏళ్లకే షుగర్, క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయన్నారు. అందుకు కారణం, ఆహారపు అలవాట్లు, జీవనశైలే ప్రధాన కారణం అని అన్నారు.