తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి,టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు తనయుడు,యువనేత తుమ్మల యుగంధర్ తన తండ్రి బాటలోనే నడుస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎవరు ఏ సమస్యలో ఉన్న.. ఏ కష్టాల్లో ఉన్న కానీ నేనున్నానే భరోసానిస్తు వార్తల్లో నిలుస్తున్నాడు.
తాజాగా గుండె జబ్బుతో బాధపడుతున్న పదిహేను రోజుల బాబును చూసేందుకు యుగంధర్ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నుండి ఆస్పత్రికి చేరుకున్నారు. జిల్లాలోని కూసుమంచి మండలం గైగోళ్ల పల్లి గ్రామానికి చెందిన కోరుట్ల ఉపేందర్ కు పదిహేను రోజుల బాబు ఉన్నాడు.
ఆ బాబు గుండె సంబంధిత సమస్య రావడంతో హైదరాబాద్ లోని స్టార్ ఆస్పత్రిలో చేర్చారు. నిన్న గురువారం శస్త్రచికిత్స నిర్వహించిన విషయం తెలుస్కున్న యుగంధర్ ఆస్పత్రికి చేరుకుని వెళ్లి బాబును చూసి తల్లిదండ్ఉలను పరామర్శించి .. వారి ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైస్ద్యసేవలు అందించాలని ఆస్పత్రి వైద్యులను ఆదేశించారు.