ఆర్టీసీ సమ్మె విరమించిన తెలంగాణ ఆర్టీసీ సిబ్బందిని ఈ రోజు శుక్రవారం నుంచి విధుల్లోకి రావాలని ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన సంగతి విదితమే. అంతేకాకుండా సమ్మె కాలంలో మరణించిన కార్మిక కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగమిస్తానని కూడా ప్రకటించారు.
తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీపై మరో ముందడుగు వేశారు. ఇందులో భాగంగా ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్రంలో ఉన్న మొత్తం 97 డిపోల నుంచి ఐదుగురు చొప్పున(మగవారి నుంచి 3గ్గురు,ఆడవారి నుంచి2)కార్మికులను ఆహ్వానించనున్నారు .
వచ్చే ఆదివారం నాడు వారితో అన్ని చర్చించినాక .. మధ్యాహ్నాం భోజనం చేయనున్నారు. మరోవైపు ఆర్టీసీ యూనియన్ల లీడర్లకు రీలీఫ్ తో కూడిన డ్యూటీలను యజమాన్యం రద్దు చేసింది. కార్మికుల సమస్యల కోసం పని చేసిన యూనియన్ల నేతలకు గతంలో వేతనంతో కూడిన రీలీఫ్ డ్యూటీలను యజమాన్యం ఇచ్చింది.