తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలో వెటర్నీ డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణమైన హాత్యకు గురైన సంగతి విదితమే. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ”షాద్ నగర్లో జరిగిన ఘటన చాలా బాధాకరమైనదన్నారు. బాధితురాలి కుటుంబానికి చెందిన ఒకరికి ఉద్యోగం ఇస్తామని ఆయన అన్నారు.ఈ దారుణమైన ఘటనకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ప్రియాంకారెడ్డి తన సోదరికి ఫోన్ చేసినప్పుడు 100కి కూడా ఫోన్ చేసి ఉంటే పోలీసులు వచ్చేవారు. ఆమెను కాపాడే అవకాశం ఉండేదని మంత్రి తలసాని ఈ సందర్భంగా తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
