తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ వాసులుఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హైటెక్‌సిటీ -రాయదుర్గం మెట్రో మార్గాన్ని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
1.5 కి.మీ. మార్గాన్ని హైటెక్‌సిటీలో ప్రారంభించి.. అక్కడినుంచి రాయదుర్గం వరకు మెట్రోలో అధికారులతో కలిసి మంత్రులు ప్రయాణించారు.
మెట్రోరైలు కొత్తమార్గం మధ్యాహ్నం 2:30 గంటల నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఈ మార్గంతో మెట్రోకు అదనంగా 40 వేలమంది ప్రయాణికులు పెరుగుతారని మెట్రోరైలు అధికారులు తెలిపారు.
కారిడార్ -3 మార్గంలో భాగంగా ఇప్పటికే నాగోల్ నుంచి హైటెక్‌సిటీ వరకు రాకపోకలు సాగిస్తుండగా మరో 1.5 కి.మీ. మార్గం నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది.