తెలంగాణ రాష్ట్రఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ మరోసారి అవకాశం కల్పించారు. ఆర్టీసీ కార్మికులు రేపు ఉదయం విధుల్లోకి చేరండని సూచించారు. అందరూ ఉద్యోగాల్లో చేరండని, హాయిగా ఉండడని చెప్పారు. ఎటువంటి షరతులు పెట్టమని, ఉద్యోగాల్లో కార్మికుల చేరండన్నారు. వచ్చే సోమవారం నుంచి ఆర్టీసీలో ఛార్జీల పెంపు ఉంటుందని తెలిపారు.
కిలోమీటరుకు 20 పైసలు పెంచేందుకు ఆర్టీసీకి అనుమతిస్తున్నట్లు వెల్లడించారు.సమ్మెలో చనిపోయిన కార్మికుల కుటుంబాల్లోని ఒకరికి ఆర్టీసీ లేదా ప్రభుత్వంలో ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఆర్టీసీ సంస్థకు అవసరమైతే రూ.100 కోట్లు ఇస్తామని తెలిపారు. మధ్యప్రదేశ్‌లో 35వేల ప్రైవేట్ బస్సులకు పర్మిట్ ఇచ్చారని చెప్పారు.
నాలుగైదు రోజుల్లో ప్రతీ డిపో నుంచి 5-7 కార్మికులను పిలిచి ప్రగతిభవన్‌లో మాట్లాడతానన్నారు. యూనియన్ల స్థానంలో ప్రతీ డిపోలో వర్కర్ వెల్ఫేర్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఆర్టీసీని అద్భుతంగా తీర్చిదిద్దుతామని, మీరు బాధపడాలని తామెందుకు భావిస్తామని ప్రశ్నించారు. కార్మికులను కాదని తాము నిర్ణయం తీసుకోమని, కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ స్పష్టం చేశారు.