తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు,హీరో రాజశేఖర్ కు అధికారులు షాక్ ఇవ్వనున్నారు అని సమాచారం. ఇటీవల ఓఆర్ఆర్ మీద పరిమితులకు మించి అతివేగంతో కారు ప్రమాదానికి కారణమైన హీరో రాజశేఖర్ కు అధికారులు షాక్ ఇవ్వబోతున్నారు .
ఈ క్రమంలో ఆయనకు ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలనే ప్రతిపాదన వచ్చినట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. ఈ మేరకు ఆర్డీఏ అధికారులకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు లేఖ రాసినట్లు కూడా సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి.
ట్రాఫిక్ చట్టాలను గతంలో రెండు నుంచి నాలుగు సార్లు హీరో రాజశేఖర్ ఉల్లంఘించినట్లు బయటపడింది. ఆయన డ్రైవింగ్ లో కారు కూడా రెండు సార్లు ప్రమాదానికి గురవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు అంటున్నాయి.