ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజధాని పర్యటన లో క్షమాపణలు చెప్పాలంటూ రైతులు చేసిన ఆదోళన తెలిసిందే. ఈ విషయమై ఆర్కే రోజా మాట్లాడుతూ బాబు అమరావతికి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. బినామీ ఆస్తులు ఎలా ఉన్నాయో చూసుకోవడానికి వెళ్లారా అని ఆమె నిలదీశారు. అమరావతిలో ఎక్కడైనా శాశ్వత కట్టడాలు నిర్మించారా అని ప్రశ్నించారు. భూములు ఇచ్చిన రైతులకు ఏమైనా న్యాయం చేశారా అన్నారు. అడుగుకు రూ.10 వేలు దోపిడీ చేశారని విమర్శించారు. రాజధాని పేరుతో ఎల్లోమీడియాలో గ్రాఫిక్స్ చూపించారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు గత 5 సంవత్సరాల పాలనలో చేయలేని అభివృద్ధి జగన్ ప్రభుత్వం కేవలం 6 నెలలోనే చేసి చూపించారని రోజా తెలిపారు.
