టాలీవుడ్ వివాదాస్పద మరియు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇండస్ట్రీలో ప్రతీఒక్కరిని టార్గెట్ చేసి మరి ట్రోల్ చేస్తాడు. ఆ సాహసం చేసే వ్యక్తి ఆయన ఒక్కడే అని కూడా చెప్పాలి. మరోపక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కూడా భారీగా ట్రోల్ చేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే వర్మ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో చిరంజీవిని కాకుండా అస్తమాను పవన్ నే ఎందుకు ట్రోల్ చేస్తాడో క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం వర్మ అమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో పవన్ లానే ఒక పాత్రను పెట్టాడు. అయితే ఒక ఛానల్ ఇంటర్వ్యూ లో పవన్ మాటలు మరియు పద్ధతి వల్లే ట్రోల్ చేస్తున్నామని అన్నారు. పవన్ ని ట్రోల్ చేస్తాం తప్పా చిరంజీవిని కాదు. ట్రంప్ ని ట్రోల్ చేసినట్టు ఒబామాన్ని చెయ్యలేము కదా అని చెప్పారు. గత ఏడాది మే నెలలో పవన్ శ్రీవారిని దర్శించుకోడానికి కాలినడకన వెళ్ళగా మార్గమధ్యలో కుర్చీలో కూర్చున్నాడు. ఆ ఫోటో అప్పట్లో సోషల్ మీడియాలో భారీగా హల్చల్ చేసింది. అప్పుడే వర్మ ఆ పిక్ ని పోస్ట్ చేసి ట్రోల్ చేసాడు.
