ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా అది సంచలనంగానే ఉంటుంది. నిన్నటివరకు ఆంగ్ల మాధ్యమం కోసం జగన్ చేసిన పోరాటం తెలినదే. ఇచ్చిన హామీలకన్నా ప్రజలకు ఎక్కువ చేసి చూపించడం జగన్ కు అలవాటు తాజాగా విద్యా కమిషన్ సమీక్ష సమావేశంలో మాట్లాడిన అంశాలపై ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు విద్యను భోదించడంతో పాటు స్కూలు బ్యాగు, నోట్‌బుక్స్, టెక్ట్స్ బుక్స్, 3 జతల యూనిఫారమ్స్, జత షూస్, సాక్సులు కిట్టు గా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం యూనిఫారమ్స్ కుట్టించుకునేందుకు డబ్బులు, ఒక జతషూస్,సాక్సుల కొనుగోలు కోసం డబ్బులు ఇవ్వనున్న ప్రభుత్వం. మిగిలిన వాటిని కిట్ల రూపంలో అందించనన్నారు.పాఠశాలలు తెరిచే నాటికి ఇవ్వన్నీ అమలుపరచాలని సీఎం జగన్ ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త పాఠ్యప్రణాళికను తయారుచేయడంపై సీఎం చర్చజరిగింది. వచ్చే ఏడాది 1 నుంచి ఆరో తగరతి వరకూ ఇంగ్లిషు మీడియంకు పిల్లలను సన్నద్ధం చేసేందుకు బ్రిడ్జి కోర్సులను నిర్వహిస్తామన్న అధికారులు బ్రిడ్జి కోర్సుల నిర్వహణపై ప్రతిపాదనలను సీఎంకు వివరించారు.
విద్యా సంవత్సరం ప్రారంభమైన మొదటి నెలరోజులు పిల్లలకు బ్రిడ్జికోర్సులు చేపట్టాలని అధికారుల ప్రతిపాదన చేశారు ఇలా చేయడంవల్ల విద్యార్థులుకు లబ్ది చేకూరుతొడని తెల్పారు. టీచర్లకు శిక్షణ, పిల్లలకు బ్రిడ్జి కోర్సులపై పూర్తిస్థాయి వివరాలతో ప్రజంటేషన్ ఇవ్వాలన్న సీఎం పటిష్టమైన పాఠ్యప్రణాళిక, అంతర్జాతీయ విద్యాసంస్థల భాగస్వామ్యంతో ఉత్తమ ప్రమాణాలు తీసుకువస్తున్నామని సీఎం జగన్ తెల్పారు. గణితాన్ని సులభంగా అర్థంచేసుకోవడానికి చికాగోయూనివర్శిటీ రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం అవుతుందన్న ముఖ్యమంత్రి అలాగే ఉపాధ్యాయులకు శిక్షణ, ఇంగ్లిషు మాధ్యమం, బోధన తదితర అంశాల్లో బ్రిటిష్ కౌన్సిల్ భాగస్వామ్యం అవుతుందన్న సీఎం ఉత్తమ ఫలితాలనిచ్చే విద్యావిధానాలు, విద్యావ్యవస్థల అంశాల్లో సింగపూర్ ప్రభుత్వం సహకారం ఉంటుందన్న అధికారులు ఇలాంటి గొప్ప సంస్థలు, ప్రతిష్టాత్మక విద్యాసంస్థల భాగస్వామ్యం ప్రభుత్వ విద్యా వ్యవస్థలో గొప్ప మార్పులను తీసుకు వస్తుందని విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న మార్పులపై ఇవాళ దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోందన్నారు. వీటి అమలు విషయమై కఠినంగా వ్యవహరించాలని ఎక్కడా రాజీపదవొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.సీఎం జగన్ విద్యా వ్యవస్థపై తీసుకున్న ఈ నిర్ణయాలు విద్యా వ్యవస్థపై పెను మార్పులు తీసుకువస్తుంది అనడంలో సందేహమే లేదు. దీనిపై ప్రజలు సర్వతా హర్షం వ్యక్తం చేస్తున్నారు తమ పిల్లల భవిషత్తుపై సీఎం జగన్ చేస్తున్న కార్యక్రమాల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.