కొత్త మద్యంపాలసీ ప్రకారం లైసెన్సులు జారీ చేసేందుకు ఎక్సైజ్‌శాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేయనుంది. గతంలో జిల్లాస్థాయిలో ఆయా ప్రాంతాల్లో ఉన్న బార్ల సంఖ్యను బట్టి వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చేవారు. కానీ.. ఈసారి ఎక్సైజ్ కమిషనర్ రాష్ట్రవ్యాప్తంగా అన్నింటికీ కలిపి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
ఇక నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. శుక్రవారం నుంచి వచ్చేనెల డిసెంబర్ 6 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. 7న లాటరీ నిర్వహిస్తారు. తర్వత ఆయా ప్రాంతాలకు లైసెన్సీలను ఎంపిక చేస్తారు. అంతేకాదు గతంలో లైసెన్సులను ఒక బార్ యూనిట్ గా ప్రతి బార్ కు వేర్వేరుగా నిర్వహించేవారు. అయితే ఇప్పుడు అలా కాదు.. మునిసిపల్ కార్పొరేషన్ లేదా మునిసిపాలిటీ యూనిట్ గా అన్ని బార్లకు కలిపి లాటరీ నిర్వహించి లైసెన్సీలను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
ఇవీ రూల్స్:
> బార్ లైసెన్స్ దరఖాస్తు ఫీజు రూ.10 లక్షలు.
> బార్ లైసెన్సు వచ్చినా, రాకపోయినా దరఖాస్తు ఫీజు తిరిగి చెల్లించరు.
> బార్లలో అమ్మే మందులో కల్తీతయారీ వంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవు.. లైసెన్స్ ఫీజుకు 3 రెట్లు ఎక్కువగా ఫైన్, 6 నెలల జైలుశిక్ష ఉంటుంది.