నారావారి పుత్రరత్నం లోకేష్ టంగ్ స్లిప్పులతో ఎన్నోసార్లు నవ్వులపాలయ్యాడు. .తెలుగుదేశం అధినేత చంద్రబాబు తనయుడై ఉండి తెలుగు భాషమీద పట్టులేకపోవడం, విషయ పరిజ్ఞానం లేకపోవడం మాట్లాడేటప్పుడు తడబడి ఏదేదో మాట్లాడేసి నవ్వుల పాలవడం..లోకేష్‌కు అలవాటుగా మారిపోయింది. సైకిల్‌కు ఓటేస్తే మనకు మనం ఉరిపెట్టుకున్నట్లే అన్నా..ఈ రాష్ట్రంలో మతపిచ్చి, కులపిచ్చి ఉన్న పార్టీ ఏదంటే.అది తెలుగుదేశమే అన్నా..డెంగ్యూ జ్వరాన్ని నోరు తిరగక ఘోరమైన బూతపదంతో పలికినా..జయంతిని వర్థంతిని చేసినా అది లోకేష్‌కే చెల్లింది. చినబాబు వాగ్ధాటిని తట్టుకోలేక ట్విట్టర్‌కే ఎక్కువ శాతం పరిమితం చేసినా..ఏదో ఒకటి జగన్‌ను, వైసీపీని తిట్టబోయి నెట్‌జన్లకు అడ్డంగా దొరికిపోతున్నాడు. పాపం లోకేష్‌పై వచ్చిన సెటైర్లు దేశంలో ఏ నాయకుడి కొడుకు మీద రాలేదంటే అతిశయోక్తి లేదు. అందుకే రాంగోపాల్ వర్మ పప్పులాంటి అబ్బాయి అంటూ లోకేష్‌ను తన సిన్మాలో ఓ రేంజ్‌లో ఆడేసుకోబోతున్నాడు.
అయితే తాజాగా లోకేష్‌లోని ఫన్నీ యాంగిల్ మరోసారి బయటకు వచ్చింది..బాబు అమరావతి టూర్ సందర్భంగా బస్‌లో తీసిన రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అందులో ఒకటి బాబు కాన్వాయ్ వెళుతుంటే వచ్చిన పార్టీ శ్రేణులను ఉద్దేశించి చంద్రబాబు టిఫినీలు పెట్టారా అని ఎదురుగా ఉన్న టీడీపీ నేతను అడుగగా డబ్బులే..డబ్బులు లేకుండా ఎవరు వస్తారంటూ సదరు నేత జవాబు ఇవ్వగా చంద్రబాబు నవ్వుతూ అంతా పెయిడ్ ఆర్టిస్టులేగా అంటూ కామెంట్ చేసిన వీడియో కాగా…మరొకటి బస్‌లో లోకేష్ ఓ టీడీపీ నేతతో సరదాగా ఆటపట్టిస్తున్న వీడియో. ఆ వీడియోలో బస్సు రన్నింగ్‌లోనే ఉండగానే లోకేష్ బస్సు మధ్యలో నిలబడి పార్టీనేతలతో జోకులు వేస్తున్న సీన్ కనిపిస్తుంది. ఓ టీడీపీ నేత అందాన్ని లోకేష్ బాబు పొగుడుతున్నట్లు ఆ వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది..చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నారు..మీరు..మీ హెయిల్‌స్టైల్ బాగుంది మీది అంటూ లోకేష్ ఓ టీడీపీ యువనేతను తెగ పొగిడేస్తూ..ఆటపట్టిస్తున్నాడు..ఈ వీడియో సోషల్ మీడియాలో ఘోరంగా ట్రోల్ అవుతోంది.. ఇదిలా ఉంటే గతంలో మంగళగిరి పర్యటనలో ఓ పెద్దావిడ మజ్జిగ ఇచ్చిన సందర్భంలో లోకేష్ ఏం వేశావు ఇందులో..చక్కెరా..”తియ్యగుంది” అంటూ తనదైన స్టైల్లో అన్న మాటలనువర్మ తన సిన్మాలో పెట్టేసి బోల్డంత కామెడీ చేశాడు. ఆ సీన్‌ను నెట్‌జన్లు గుర్తు చేస్తూ..వార్నీ లోకేష్..నీలో ఈ సరదా యాంగిల్ కూడా ఉందా..వర్మ సిన్మా పూర్తయింది కాని..లేకుంటే ఈ వీడియో చూస్తే నీలోని ఈ యాంగిల్‌ను మరో రకంగా (గే యాంగిల్‌లో) చూపించేవాడంటూ..బతికిపోయావంటూ ఓ రేంజ్‌లో సెటైర్లు వేస్తున్నారు.