తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అరూరి రమేష్ సపరెట్ రూట్. ఎవరు ఏ సమస్యలో ఉన్న కార్యకర్తనా.. నేతనా.. ఎవరా అని చూడరు. సమాచారమందితే చాలు అక్కడ వాలిపోతారు. గతంలో కాకితో కబురు పంపితే చాలు సమస్య అంటే నేనున్నానని వస్తారు అని వింటుంటాం.
కానీ ఇప్పుడు అరూరి రమేష్ అదే నిజం చేస్తున్నారు. కాకితో కబురు పంపిన మీదగ్గరకు వస్తా.. మీ కష్టాల్లో తోడుంటా.. మీకు అండగా ఉంటాను అని అంటున్నారు.
ఈ క్రమంలో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గ్రేటర్ యాబై ఏడవ డివిజన్ టీఆర్ఎస్ నాయకుడు సూర సతీశ్ యాదవ్ పెద్దమ్మ నర్సమ్మ ఇటీవల మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అరూరి సతీశ్ యాదవ్ ను పరామర్శించి సానుభూతి తెలిపారు. బాధపడకండి. మీ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసానిచ్చారు ఎమ్మెల్యే అరూరి.