ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందన అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం అందరికి తెలిసిందే .. ఈ క్రమంలో స్పందన గురించి జగన్ అధికారులకు గ్రామ సచివాలయ ఉద్యోగులకు జిల్లా కలెక్టర్లకు పలు ముఖ్యమైన సూచనలు చేశారు. స్పందన కార్యక్రమంలో అర్జీ ఇవ్వడానికి వచ్చేవారిని చిరునవ్వుతో స్వాగతించాలని, ఇచ్చిన ప్రతి అర్జీని సీరియస్‌గా తీసుకోవాలన్నారు. మనసా, వాచా , కర్మణా పని చేసినప్పుడే బాధితులకు న్యాయం చేయగలుగుతాం. మనకేదైనా సమస్య వస్తే ఎలాంటి పరిష్కారం కోరుకుంటామో అలాంటి పరిష్కారమే మన దగ్గరకొచ్చేవారికి అభించేలా చర్యలుండాలని జగన్ అన్నారు. స్పందన తో పాటుగా ప్రతి ఇంటికి గ్రామ వాలంటీర్ లను పంపి వారి అవసరాలు ప్రభుత్వ పథకాలు ఏమైనా అవసరమో తెలుసుకొని మరీ సాయం చేయాలన్నారు.