సయిద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా ఈరోజు కర్ణాటక, హర్యానా మధ్య మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు కర్ణాటక కెప్టెన్ మనీష పాండే. హర్యానా నిర్ణీత 20ఓవర్స్ లో 8వికెట్లు నష్టానికి 194 పరుగులు చేసింది. అయితే మ్యాచ్ 20వ ఓవర్లో కర్ణాటక బౌలర్ అభినవ్ మిథున్ ఒక అద్భుతాన్ని సృష్టించాడు. ఆ అద్భుతం ఏమిటంటే చివరి ఓవర్ లో హ్యాట్రిక్ తీసాడు. అంతేకాకుండా ఆ ఓవర్ లో మొత్తం ఐదు వికెట్లు పడగొట్టాడు. మొదటి నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి, చివరి బంతికి మరొక వికెట్ తీసాడు.