2014 అధికారంలోకి వచ్చాయక నిరుద్యోగుల కల నెరవేరుతుందని ఎంతో ఆశపడ్డారు. ఎన్నికలకు ముందు ఇంటికో ఉద్యోగమని చెప్పి అందరిని నమ్మించిన బాబు చివరికి గెలిచాక అందరిని నట్టేట ముంచేసాడు. దాంతో రాష్ట్రంలో యువత మొత్తం చంద్రబాబుకి ఎలాగైనా బుద్ధిచెప్పాలని నిర్ణయించుకున్నారు. దాంతో మొన్న జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడించారు. జగన్ నమ్మి ఓట్లు వేసినందుకు నిరుద్యోగ యువతకు సరైన న్యాయం చేస్తున్నారు జగన్. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి చంద్రబాబుకి సరైన బుద్ధి చెప్పారు. “యువతకు ఉద్యోగాల్లో 75% రిజర్వేషన్ తప్పంటున్నాడు చంద్రబాబు. ఇతర రాష్ట్రాలు కూడా ఇటువంటి విధానం పెడితే మన వాళ్ల పరిస్థితి ఏమిటని నిద్ర పట్టట్లేదట. ఇక్కడ ఉద్యోగాలు కల్పిస్తే బయటకు వెళ్లాలని ఎవరనుకుంటారు బాబూ? అయినా పొరుగు రాష్ట్రాలు ఆ నిబంధన పెట్టకుండా మీరు ఆపగలరా?” అని ప్రశ్నించారు.