ఏపీలో జగన్ సర్కార్‌పై ప్రతిపక్ష టీడీపీ గత 5 నెలలుగా ఎంతగా దుష్ప్రచారం చేస్తున్న ఫలితం లేకుండా పోయింది..రాజధాని తరలింపు , పోలవరం, రివర్స్ టెండరింగ్, కృష్ణానదికి వరదలు, పల్నాడు దాడులు, , కోడెల ఆత్మహత్య, ఇసుక కొరత, ఇంగ్లీష మీడియం, తాజాగా అమరావతిలో బాబు పర్యటన అన్నీ అట్టర్‌ఫ్లాప్ అయ్యాయి. ఒకవైపు చంద్రబాబు, లోకేష్, మరోవైపు పవన్ కల్యాణ్‌లు ప్రభుత్వంపై రోజూ ఏదో ఒక టాపిక్ పట్టుకుని బురద జల్లుతూనే ఉన్నారు. ఆఖరికి రంగుల పేరుతో పార్టనర్లు రాజకీయం చేస్తున్నారు. తాము చేస్తే సంసారం..ఎదుటోళ్లు చేసే వ్యభిచారం అన్నట్లు బాబు తీరు ఉంటుంది. టీడీపీ హయాంలో ప్రభుత్వ కార్యాలయాలకు, చంద్రన్న తోఫాలు, సంక్రాంతి కానుకలకు, సంచులపై, ఆఖరకు అప్పడాలపై కూడా చంద్రబాబు ఫోటో వేసుకుని ప్రచారం చేసుకున్న టీడీపీ ఇప్పుడు రంగుల పేరుతో వైసీపీని బద్నాం చేయడానికి కుట్ర చేస్తోంది. ఇప్పటికే వరదల సమయంలో లోకేష్ టీమ్ ఆధ్వర్యంలో సీఎం జగన్‌ను, మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌ను కులంపేరుతో అసభ్యంగా దూషించిన పెయిడ్ ఆర్టిస్టులు అడ్డంగా దొరికిపోయి జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. అలాగే తిరుమలలో చర్చి అంటూ ప్రచారం చేసిన మరో టీడీపీ కార్యకర్తను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయినా ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి లోకేష్ టీమ్ పెయిడ్ఆర్టిస్టులనే ఉపయోగించుకుంటుంది. చంద్రబాబు అమరావతి పర్యటనలో కూడా కార్యకర్తల ముసుగులో భారీగా పెయిడ్ ఆర్టిస్టులను దింపి రాజధానిలో అలజడి రేపేందుకు కుట్ర చేశారు. ఈ విషయాన్ని బస్సులో చంద్రబాబు అందరూ పెయిడ్ ఆర్టిస్టులేగా అంటూ అడ్డంగా దొరికిపోయాడు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు, వాటర్ ట్యాంక్‌లకు, గాంధీ విగ్రహానికి ఆఖరుకు స్మశానాలకు కూడా వైసీపీ రంగులు వేస్తున్నారంటూ టీడీపీ సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తోంది. దానికి పవన్ కల్యాణ్ వంతపాడుతున్నాడు. సీఎం జగన్‌ను, ప్రభుత్వాన్ని బద్నాం చేస్తూ ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో చంద్రబాబు, లోకేష్, టీడీపీ అఫీషియల్ పేజీలలో పోస్ట్ చేసిన రెండు గంటలకు అవే పోస్టులు పవన్ కల్యాణ్, జనసేన ట్విట్టర్, ఫేస్‌బుక్ పేజీలలో ప్రత్యక్షమవుతున్నాయి. దీన్ని బట్టి పార్టనర్లు ఊహాత్మకంగా వైసీపీపై బురద జల్లుతున్నట్లు అర్థమవుతోంది.
కాగా ఇప్పటికే సీఎం జగన్‌పై తిరుమల డిక్లరేషన్ అంటూ పార్టనర్లు బాబు, వపన్‌లు మత రాజకీయం చేస్తున్నారు. మరోవైపు ఇంగ్లీష్ మీడియం పేరుతో జగన్ సర్కార్ మతమార్పిడులకు సహకరిస్తుందంటూ నీచమైన విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వంపై ఎన్ని రకాలుగా ఎంతగా బురదజల్లినా ఫలితం లేకపోవడంతో టీడీపీ మతం పేరుతో విద్వేషాలు రగిలించిందేందుకు కుట్ర చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలో హిందూ దేవుళ్ల బొమ్మలకు, విగ్రహాలకు వైసీపీ రంగులు వేయించి..ఆ నెపాన్ని ప్రభుత్వంపై నెట్టివేసి మత విద్వేషాలు రగలించేందుకు, జగన్‌పై క్రిస్టియన్ ముద్ర వేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నట్లు సమాచారం. ఇంకొన్ని చోట్ల క్రిస్టియన్ల పేరుతో మత విద్వేషాలు రగిలించాలని బాబు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే లోకేష్ టీమ్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న పెయిడ్ ఆర్టిస్టులకు ఆదేశాలు జారీ చేశాడంట..మత విద్వేషాలు రగిలించడం టీడీపీకి కొత్తేం కాదు.. ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ విషయంలో హిందూ ఆలయాల్లో పని చేస్తున్న అన్యమతస్థులను తీసివేసినందుకే ఎల్వీని తీసేసినట్లు కొన్ని క్రిస్టియన్ సంఘాలు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన వార్తలు మీడియాలో హల్‌చల్ చేశాయి. అయితే క్రిస్టియన్ సంఘాల పేరుతో ధన్యవాదాలు చెప్పినవారిలో బాబుగారి ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన నిందితుడు జెరూసలెం మత్తయ్య కూడా ఉన్నాడు. దీన్ని బట్టి క్రిస్టియన్ సంఘాల పేరుతో హిందూవుల మనోభావాలను దెబ్బతీయడం ద్వారా సీఎం జగన్‌పై మతముద్ర వేసేందుకు టీడీపీ కుట్ర చేసిన విషయం బయటపడింది. తాజాగా మరోసారి క్రిస్టియన్ సంఘాల పేరుతో హిందూవుల మనోభావాలను కించపర్చేలా చేసి, ప్రభుత్వాన్ని, ముఖ్యంగా సీఎం జగన్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలని చంద్రబాబు ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో జనసేన సహకారం తీసుకోవాలని బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజలు తన కంటే పవన్ కల్యాణ్‌ను కాస్తా కూస్తో నమ్ముతారని భావిస్తున్న చంద్రబాబు ఈ మేరకు రంగుల పేరుతో మత విద్వేషాలు రగలించేందుకు జనసేన శ్రేణులను కూడా రంగంలోకి దింపుతున్నట్లు భోగట్టా..చూశారుగా..వైసీపీ శ్రేణులారా…బహుపరాక్..మరికొద్ది రోజుల్లో దేవుళ్ల ఫోటోలకు, విగ్రహాలకు వైసీపీ రంగులు కనిపిస్తే..వెంటనే అప్రమత్తమై..ఆ పని ఎవరు చేశారో కనిపెట్టి..టీడీపీ, జనసేన మత రాజకీయాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.