ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడు. ఆయన విషయానికి వస్తే 40ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు ఎన్నడూ ప్రజలపై ప్రేమ, అభిమానం చూపలేదనే చెప్పాలి. మరోపక్క అధికారాన్ని మాత్రం చాలా బాగా ఉపయోగించుకున్నాడు. అది కూడా రాష్ట్రము బాగుకోసం కాదు తన సొంత వాళ్ళకోసం, కుటుంబం కోసమే అని చెప్పాలి. అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు విజయసాయి రెడ్డి.”పార్టీ కార్యకర్తలంటే చంద్రబాబుకు ఎంత చులకనో ఇంకోసారి వీడియో సాక్షిగా బయటపడింది. కార్యకర్తలకు డబ్బు, మద్యం అలవాటు చేసిందే ఆయన. పెయిడ్ ఆర్టిస్టులుగా మారారని అధికారం కోల్పోయాక తల బాదుకుంటున్నాడు. బాబుకు ఎవరి మీద గౌరవం, అభిమానాలు ఉండవు. ప్రేమ నటిస్తాడంతే” అని అన్నారు.
