చంద్రబాబు అమరావతి పర్యటనలో టీడీపీ కార్యకర్తలు హల్‌చల్ చేశారు. బాబు కాన్వాయ్ వెళుతుంటే..దారివెంట జై చంద్రబాబు అంటూ ఓ రేంజ్‌లో నినాదాలు ఇచ్చారు.. బస్‌లో కూర్చున్న చంద్రబాబు వారిని చూసి ఉబ్బిపోయిన చంద్రబాబు తనదైన స్టైల్లో రెండు వేళ్లు చూపించుకుంటూ..మురిసిపోయారు. అయితే బాబుగారి టూర్‌కు అసలు సిసలైన టీడీపీ కార్యకర్తలే ముఖం చాటేశారంట..ఐదేళ్లు రాజధానిలో ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ కట్టకుండా.. .ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని ఐదు నెలలలో ఏం చేయలేదని..ఎలా నిలదీస్తాం..రావడానికి బాబుగారికైనా సిగ్గుండాలి..జై కొట్టడానికి మాకన్నా సిగ్గుండాలంటూ..మేము వచ్చేదిలేదంటూ టీడీపీ కార్యకర్తలు నాయకులకు తెగేసి చెప్పారంట..దీంతో బాబుగారు తన టూర్‌కు షరామామూలుగా పెయిడ్ ఆర్టిస్టులను దింపమని..ఆర్డరేశారంట..గతంలో జగన్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి పెయిడ్ ఆర్టిస్టులను బాగా ఉపయోగించిన అనుభవం లోకేష్ టీమ్‌కు ఉంది..ఇంకేముంది వెంటనే టీడీపీ కార్యకర్తల ముసుగులో పెయిడ్ ఆర్టిస్టులను దింపారు. వారు జై చంద్రబాబు అంటూ ఓ రేంజ్‌లో పెర్‌ఫార్మ్ చేశారు. అంతే కాదు బాబు కాన్వాయ్‌పై అడ్డుకున్న రైతులపై దాడిచేసి మరీ చేసి తీసుకున్న డబ్బులకు న్యాయం చేశారు. ఈ మాట స్వయంగా చంద్రబాబు బస్‌లో చెప్పుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. అమరావతి పర్యటనలో తన పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి చంద్రబాబు గురువారం బస్సులో బయల్దేరారు. ‘కార్యకర్తలకు టిఫిన్లు పెట్టారా?’ అంటూ బస్సులో తన ఎదురుగా ఉన్న ఓ టీడీపీ నేతను చంద్రబాబు ప్రశ్నించారు. ‘అంతా డబ్బులే’..డబ్బులు ఇవ్వకుండా ఎవరు వస్తున్నారు అని ఆ నాయకుడు అనగా.. ‘అంతా పెయిడ్ ఆర్టిస్ట్‌లేగా’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ వీడియోను ఎవరు తీశారో కాని..సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో టీడీపీ కార్యకర్తల పేరుతో పెయిడ్ ఆర్టిస్టులను దింపి రాజధానిలో అలజడి రేపడానికి చంద్రబాబు చేసిన కుట్ర బయటపడింది. ప్రస్తుతం అందరూ పెయిడ్ ఆర్టిస్టులేగా అని చంద్రబాబు అంటున్న ఈ వీడియో సోషల్ మీడియోలో వైరల్‌గా మారింది.
blob:https://www.sakshi.com/dc6dfaed-4c34-4bf2-b373-696f9873cba0