చంద్రబాబు రాజధాని పర్యటనలో తీవ్రమైన పరాభవం ఎదురవ్వడానికి కారణం రాజధాని నిర్మాణం లోను రైతుల వద్ద భూసేకరణ లోను బాబు చేసిన అవినీతియే కారణం అని ఆయన గ్రహించాలని గుర్తుచేస్తూ, టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మాణంలో అవినీతి జరిగిందన్న విషయం పై వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తాయని మంత్రి బుగ్గన రాజేంద్రనాదరెడ్డి చెప్పారు. బాబు అమరావతి గ్రామాలలో పర్యటించి ప్రభుత్వంపై చేసిన విమర్సలను బుగ్గన తిప్పి కొట్టారు. అసలు రాజధాని ని చంద్రబాబు ఎక్కడ నిర్మించారని ప్రశ్నించారు. అన్ని తాత్కాలిక భవనాలేనని చంద్రబాబే చెప్పారని ఆయన గుర్తు చేశారు. మహిష్మతి కోసం రాజమౌళి సలహాలు తీసుకోవాలని అనుకున్నారు.
ఎప్పుడో రాచరికం ఉన్నప్పుడు రాజధాని కేంద్రీకరణ జరిగింది. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా వికేంద్రీకరణ జరుగుతోందని ఆయన చెప్పారు. సెల్ఫ్ పైనాన్సింగ్ నిజమే అయితే నెలకో నగరం కట్టొచ్చని ఆయన ఎద్దేవ చేశారు. తమ ప్రాదాన్యతలకు తమకు ఉన్నాయని ఆయన అన్నారు.. బ్యాంకులు, బాండ్ల ద్వారా రూ.5వేల కోట్లకుపైగా అప్పు తెచ్చారని ఆయన అన్నారు. లక్ష కోట్ల రూపాయలు ఇక్కడే ఖర్చు చేయాలని చంద్రబాబు అంటున్నారు.మేము రాజధానితో పాటు ఇతర ప్రాంతాలు కూడా అబివృద్ది చెందాలని కోరుకుంటున్నంమని ఖచ్చితంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసి తీరుతామని ఆయన చెప్పారు. అవినీతి గురించి అడిగిన ప్రశ్నకు సమాదానం ఇస్తూ త్వరలోనే అన్ని వివరాలు బయటకు వస్తాయని బుగ్గన చెప్పారు.