అధికారంలో ఉన్నప్పుడు అమరావతి ప్రాంతంలోని విలువైన ప్రభుత్వ భూములను చంద్రబాబు ఇష్టారాజ్యంగా దోచుకున్నాడు. తన సామాజికవర్గ నేతలకు, పారిశ్రామికవేత్తలకు చవక ధరకు కట్టబెట్టాడు…రాజధానిలో కోట్లాది విలువైన ప్రభుత్వ భూములను కేవలం ఎకరం 500, 1000 రూపాయలకే దోచిపెట్టాడు. అలాగే తన గుంటూరులో తన సొంత పార్టీ ఆఫీసు భవనానికి కూడా నిబంధనలను తొంగలో తొక్కి మరీ..ప్రభుత్వ స్థలాన్ని చవక ధరకు కొట్టేసాడు…ప్రస్తుతం ఆత్మకూరులో నిర్మిస్తున్న టీడీపీ ప్రధాన కార్యాలయం భూకేటాయింపు వివాదంలో పడింది. వివరాల్లోకి వెళితే..తాజాగా టీడీపీ ప్రధాన కార్యాలయం కోసం గుంటూరు జిల్లాలో కేటాయించిన భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని..ఒక వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే ప్రభుత్వానికి లేఖ రాశారు. రాజధాని ప్రాంతంలో అత్యంత విలువైన భూమిని నాటి బాబు సర్కార్ తమ పార్టీ ఆఫీసు భవన నిర్మాణం కోసం నిబంధనలను అతిక్రమించి అతి తక్కువ ధరకు కేటాయించిందని..వెంటనే ఆ భూకేటాయింపును రద్దు చేయాలని కోరుతూ వేర్వేరుగా సీఎం జగన్‌కు లేఖ రాశారు..దీనిపై ఏపీ సీఎంవో కార్యాలయం స్పందించింది. దానిని రెవిన్యూ శాఖ కార్యదర్శికి రిఫర్ చేసింది. వెంటనే రంగంలోకి దిగిన రెవిన్యూ శాఖ నాటి భూకేటాయింపు బాగోతంపై కసరత్తు మొదలుపెట్టింది. గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం, ఆత్మకూరులో 3.65 ఎకరాల భూమిని టీడీపీ ప్రధాన కార్యాలయ నిర్మాణం కోసం కేటాయిస్తూ 2017 జూన్ 22 న నాటి టీడీపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ భూమిని 99 ఏళ్లపాటు లీజు ప్రాతిపదికన కేటాయిస్తూ..ఏటా ఎకరానికి రూ.1000 ఫీజుగా నిర్ణయిచింది. అంతే కాదు సదరు భూమిని మూడేళ్లలోపు సద్వినియోగం చేసుకోవాలని, ఏడాదిలోగా భవన నిర్మాణం పూర్తి చేయాలని ఆ ఉత్తర్వులో పేర్కొంది. అయితే రాజధాని ప్రాంతంలో అత్యంత విలువైన భూమిని నిబంధనలకు విరుద్దంగా 99 ఏళ్లకు కేటాయింపుకోవడమే కాకుండా..ఎకరాకు కేవలం 1000 రూపాయలు మాత్రమే ఫీజుగా నిర్ణయించుకున్నారని, తమ సొంత పార్టీ ఆఫీస్ భవన నిర్మాణం కోసం చంద్రబాబు ఇలా అడ్డదారులు తొక్కారని వైసీపీ ఆరోపిస్తుంది. తాజాగా ఈ భూ కేటాయింపుపై వైసీపీ ఎంపీ రాసిన లేఖపై స్పందించిన ప్రభుత్వం వెంటనే రెవిన్యూ శాఖకు ఈ విషయాన్ని రిఫర్ చేసింది. మొత్తంగా టీడీపీ పార్టీ ఆఫీస్ భూకేటాయింపులో నిబంధనలు అతిక్రమించారన్న విషయం స్పష్టమవుతోంది. మరి రెవిన్యూ శాఖ ఈ భూకేటాయింపు బాగోతంపై ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక ఇస్తుందో చూడాలి.
