ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత,మాజీ సీఎం నారా చంద్రబాబుకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు,మాజీ ఎంపీలు,ఎమ్మెల్యేలు టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాము.
తాజాగా ఆ పార్టీకి చెందిన నేత,ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ టీడీపీకి గుడ్ బై చెప్పారు. అంతేకాకుండా ఆయన టీడీపీకి,చైర్మన్ పదవీకి రాజీనామా చేశారు.
ఈ రోజు శుక్రవారం ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నారు. కారెం శివాజీతో పాటుగా మరికొంతమంది టీడీపీ నేతలు వైసీపీలో చేరనున్నారు అని సమాచారం.