నెల్లూరులో వాట్సాప్ ప్రేమాయణం ఓ కుటుంబంలో చిచ్చుపెట్టింది. భర్త ఇద్దరు పిల్లలున్న ఓ భార్య ప్రియుడితో వాట్సాప్ ప్రేయాయణం నసాగించింది.చివరకు విషయం బయట పడటంతో ప్రియుడ్ని చితకబాది పోలీసులకు అప్పగించాడు భర్త. నెల్లూరు వైయస్సార్ నగర్‌లో నివాసం ఉండే సలీం, ఫర్వాన్‌కు పదేళ్ల క్రితం వివాహమైంది. సలీం ఆటో మెకానిక్ కాగా, ఫర్వీన్ ఇంట్లోనే ఉండేది. ఇటీవల పరిచయమైన షేక్ షుకూర్‌తో ఫర్వీన్ వాట్సాప్ చాట్ చేయటం మొదలుపెట్టింది. వీరు బయట తరుచుగా కలుస్తూ ఉండేవారు. ఈ క్రమంలో వీరిద్దరు తీసుకున్న సెల్పీలు భర్త కంటపడ్డాయి. ఈ ఫోటోలు భర్త సలీం కట్టపడటంతో ఈ గుట్టురట్టయ్యింది. భార్యపై నిఘా పెట్టిన సలీమ్ ప్రియుడితో కలిసి ఉన్న సమయంలో కుటుంబ సభ్యుల్ని తీసుకొని వెళ్లాడు. ఇద్దర్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. షుకూర్‌పై సలీం తరపు బంధువుల దాడి చేశారు. పర్వీన్‌కు కూడా నాలుగు తగిలించారు. షుకూర్ వారి నుంచి తప్పించుకొని పారిపోయేందుకు ప్రయత్నించగా.. సలీం స్నేహితులు అతడ్ని పట్టుకున్నారు. చితకబాది పోలీసులకు అప్పగించారు.
