ప్రస్తుతం ఎక్కడ చూసినా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ హవానే నడుస్తుంది. అంటే అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్ష్. ఇవి వచ్చిన తరువాత ప్రేక్షకులు థియేటర్లుకు రావడమే మానేసారు. కొత్త సినిమాలు విడుదలైన 10 రోజులకే ఫుల్ క్లారిటీతో బయటకు వచ్చేస్తే ఇంకా థియేటర్లు మూసుకోవల్సిందే. ఈ విషయంపై సురేష్ బాబు గొంతుచించుకొని అరుస్తుంటే ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. చిన్న చిన్న సినిమాలు అయితే పర్వలేదుగాని పెద్ద సినిమాల పరిస్థితి ఏమిటి అనే విషయానికి వస్తే. డబ్బులకు ఆశపడి పెట్టినదానికి లాభం ఇస్తునారని వారికి అమ్ముడుపోతున్నారు. అయితే ఈసారి మాత్రం తమిళ నాట ఈ విషయంలో దుమారం రేగుతుంది. దీపావళి సందర్భంగా విడుదలైన ఖైదీ ఇప్పుడు హాట్ స్టార్ లో హల్ చల్ చేస్తుంది.ప్రస్తుతం ఈ చిత్రం తమిళ్ లో మంచిగా ఆడుతుంది. అయితే ఇలా బయటకు వచ్చేయడంతో వారు నిర్మాతపై మండిపడుతున్నారు. దీనికి వారు చెప్పిన కారణం ఏమిటంటే పైరసీ పెరిగిపోవడంతో ఇలా చేయక తప్పలేదని అంటున్నారు. మరి చివరికి ఏం జరగబోతుందో వేచి చూడాల్సిందే.