తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ రోజు గురువారం మధ్యాహ్నాం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో భేటీ కొనసాగుతుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితులపై చర్చించనున్నారు.
సమస్యకు ముగింపు పలికేదిశగా రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశం అవుతున్నది. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆర్టీసీ, రవాణా పరిస్థితులు, అక్కడ అమలవుతున్న విధానాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ఆర్టీసీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేదిశగా ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.