హీరోయిన్ తమన్నా భాటియా విషయానికి వస్తే క్రికెట్ విషయంలో ఐపీఎల్ కంటే బెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్స్ ఇంకొకటి ఉండదని చెబుతుంది. ఈ మెగా ఈవెంట్ ని ఒక క్రికెట్ అభిమానిగా చూడడంలో ఉన్న ఆనందం మరెక్కడా ఉండదని అంటుంది. ఈ మెగా ఈవెంట్ ఓపెనింగ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుంది ఎందుకంటే ఇందులో ఆమె కూడా పాల్గొంటుంది. అయితే ఇంతకుముందు ఎప్పుడూ తాను ఎలాంటి స్పోర్ట్స్ ఈవెంట్ లో పాల్గొనలేదని. ఇప్పుడు చాలా ఆత్రుతగా ఉందని. ఇలాంటి స్టేజ్ పై పెర్ఫామ్ చేయడం అంటే మామోలు విషయం కాదని చెప్పడం జరిగింది. మరోపక్క తనని ఐపీఎల్ ఏ జట్టుకి సపోర్ట్ చేస్తావ్ అంటే వెంటనే చెన్నై సూపర్ కింగ్స్ అని చెప్పింది. అంతేకాకుండా ధోని అంటే నాకు చాలా ఇష్టమని కూడా చెప్పడంతో ఒక్కసారిగా అందరు తన మాటలకి షాక్ అయ్యారు. ఎందుకంటే ఇంతకముందు కోహ్లి, తమన్నకున్న రిలేషన్ అలాంటిది.