జబర్దస్త్, ఢీ, పోవే పోరా’ వంటి టెలివిజన్ షోస్ ద్వారా పాపులరై ప్రేక్షకులకు మన్ననలు పొందుతున్న సుడిగాలి సుధీర్‌ని హీరోగా పరిచయం చేస్తూ శేఖర ఆర్ట్స్ క్రియేషన్స్ బేనర్ ధన్య బాలకృష్ణ హీరోయిన్‌గా శేఖర ఆర్ట్స్ క్రియేషన్స్ బేనర్ సాఫ్ట్‌వేర్ సుధీర్ చిత్రాన్ని ప్రముఖ పారిశ్రామిక వేత్త శేఖర్ రాజు నిర్మించారు. ఈ సినిమా ద్వారా రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కి మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. లేటెస్ట్ గా ఈ చిత్ర ట్రైలర్‌ను ప్రముఖ కొరియోగ్రాఫర్ చిన్ని ప్రకాష్ మాస్టర్ విడుదల చేసి టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నటి పూర్ణ, శేఖర్ మాస్టర్, సుడిగాలి సుధీర్, ప్రదీప్, రష్మీ, వర్షిణి, హైపర్ ఆది, దర్శకుడు రాజశేఖర్ పులిచర్ల, నిర్మాత శేఖర్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ ట్రైలర్ ను తనకుటుంబంగా భావించే డీ టీం , జబర్దస్త్ టీం లతో విడుదల చేయించడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు.