ఎన్నో మలుపులు.. మరెన్నో రాజకీయ ట్విస్టులతో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేందర్ పడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసి పట్టుమని వారం రోజులు గడవకముందే అక్కడ తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేము అని చేతులేత్తిసిన సంగతి విదితమే.
తాజాగా పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఈ క్రమంలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది.
ఈ మూడు అసెంబ్లీ స్థానాలను తృణమూల్ కాంగ్రెస్ దక్కించుకుంది. గతంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి 56,000ఓట్ల మెజారిటీతో గెలుపొందిన ఖరగ్ పూర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జరిగిన మూడు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. ఈ మూడు అసెంబ్లీ స్థానాలకు నవంబర్ ఇరవై ఐదో తారీఖున ఉప ఎన్నికలు జరిగాయి.