మొత్తం దేశ చరిత్రలోనే తొలిసారి రూ.10లక్షల కోట్ల మార్కెట్ విలువ దాటిన కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చరిత్రకెక్కింది. కంపెనీ షేర్ రూ.1581.25 కొత్త మార్కును సాధించింది.
దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ లోనే అతి పెద్ద కంపెనీగా నిలిచింది. ఇటీవలే ప్రపంచంలోనే ఆరో అతి పెద్ద ఇంధన దిగ్గజంగా అవతరించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎలైట్ క్లబ్ లో చేరింది.
జియో ,రియలన్స్ రిటైల్ తో గతేడాది కాలంలో 31% వృద్ధిని నమోదు చేసింది.