ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు కూడా కాకముందే ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముఖ్యమంత్రి వై ఎఎస్ జగన్ తనదయిన ముద్ర వేశారు. మొట్ట మొదటిసారి ముఖ్యమంత్రి గా పనిచేస్తున్నా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిగా పరిపాలన సాగిస్తున్నారు.వైఎస్సార్ జిల్లాలో స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ ఏడాది డిసెంబరు 26వ తేదీన స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపం చేయుటకు ముఖ్యమంత్రి జగన్ అద్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశం ఆమోదం తెలిపింది. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి, పెద్ద నందలూరు గ్రామాల మధ్య స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తారు. దీని కోసం ప్రభుత్వం ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయనున్నది.స్టీల్‌ప్లాంట్ నిర్మాణం కోసం 3,295 ఎకరాల భూసేకరణ చేయుటకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.స్టీల్‌ప్లాంట్‌కు ఇనుప ఖనిజం కోసం ఎన్‌ఎండీసీతో ప్రభుత్వం దీర్ఘకాలిక ఒప్పందం చేసుకోనున్నది. జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని తమ జీవితాలు బాగుపడతాయని ఆశిస్తున్నారు.