ఓ మెసేజ్ ఓరియంటెడ్ రీమేక్ సినిమా లో పవన్ నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. ఇటీవల రామ్ చరణ్ మలయాళ సూపర్ హిట్ లూసీఫర్ రీమేక్ హక్కులు సొంతం చేసుకున్నాడు. అయితే ఈ సినిమా పవన్ హీరోగా రీమేక్ చేస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ మెగా ఫ్యామిలీ ఆ వార్తలను ఖండించింది. లూసీఫర్ రీమేక్ హక్కులు తీసుకున్న మాట వాస్తవమే అయినా.. అది ఎవరితో తెరకెక్కించాలన్న విషయం ఇంకా నిర్ణయించలేదని మెగా హీరోగా రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చాడు.అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన బాలీవుడ్ మూవీ పింక్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు అదే కథను పవన్ కళ్యాణ్ హీరోగా తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, బోనీ కపూర్‌లు సంయుక్తంగా ఈ రీమేక్‌ను నిర్మించే ప్లాన్‌లో ఉన్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న పవన్ అభిమానులు జనసేన నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎలా ఉంటే రాజకీయనాయకులు పవన్ రీ ఎంట్రీ పై విమర్శలు గుప్పిస్తున్నారు. తన సినీ జీవితాన్ని పణంగా పెట్టి ప్రజాసేవకు వచ్చానని పవన్కళ్యాణ్ పదేపదే చెప్పుకునే వాడని ఇప్పుడు మళ్ళి పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.