ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాజధాని పర్యటన అత్యంత వివాదాస్పదం అవుతుంది. రాజధానిని పరిశీలిస్తారని వెళ్లిన చంద్రబాబుకు రైతులు భారీ షాక్ ఇచ్చారు. అంతేకాదు.. కొందరైతే బాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. మరి కొందరు చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పై చెప్పులు కూడా వేశారు. అయితే ఈ ఉదంతాన్ని పలువురు ఎన్టీరామారావు పై చెప్పులు వేసిన ఘటనను గుర్తు చేసుకున్నారు. పిల్లనిచ్చి పార్టీలో పదవిని ఇచ్చిన మామ, ఆంధ్రుల ఆరాధ్య దైవం ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి, వైస్రాయ్ హోటల్లో క్యాంపు రాజకీయం చేసినప్పుడు ఎన్టీఆర్ తన సతీమణి లక్ష్మీపార్వతితో కలిసి అక్కడికి వెళ్లారు. ఆ సందర్భంలో ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ ని చూస్తే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు అనే భయంతో ఆయనను అవమానిస్తే అక్కడనుంచి వెళ్ళిపోతాడనే దుర్బుద్ధితో చంద్రబాబు సాక్షాత్తు దేవుడు లాంటి మామగారి పైన చెప్పులు వేసిన సంఘటన తాజాగా చంద్రబాబు కాన్వాయ్ పై చెప్పులు వేసిన ఘటనతో పలువురు రాజకీయ విశ్లేషకులు పోల్చి చూస్తున్నారు.
