తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని త్వరలోనే టీపీసీసీ చీఫ్ నుండి తప్పిస్తారని వార్తలు వచ్చిన సంగతి విదితమే. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ గా ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి,రేవంత్ రెడ్డి,మాజీ మంత్రి,ప్రస్తుతం ఎమ్మెల్యే డి శ్రీధర్ బాబులలో ఎవరో ఒకర్ని నియమిస్తారని వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి విదితమే.
తాజాగా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ “తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నాలాంటి నీతి నిజాయితీలున్న కార్యకర్తను నియమించాలని ఆ పార్టీ తాత్కాలిక జాతీయ అధ్యక్షురాలు అయిన సోనియా గాంధీకి లేఖ రాశారు.
నిన్న బుధవారం ఆయన పార్లమెంట్ ఆవరణంలో సోనియా గాంధీ,రాహుల్ గాంధీలను కలిశారు. అనంతరం అంజన్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ” ఇప్పటికే రెండు సార్లు ఎంపీగా.. సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను. నేను కష్టపడి పైకి రావడమే కాకుండా పార్టీ కష్టకాలంలోనూ పార్టీతోనే ఉన్నాను” అని తెలిపారు.