చాలా రోజుల తరువాత చంద్రబాబు తనయుడు లోకేష్ కి గట్టి కౌంటర్ ఎదురయ్యింది. నాన్నగారి అండతో ఏదైనా చేయొచ్చు అనే ఆలోచనలతో ముందుకు వచ్చి ఏది మాట్లాడినా చివరికి తన నోటి మాటలతోనే అందరి ముందు పరువు పోగొట్టుకోవడం ఈయనకు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పాలి. ఈసారి కూడా ఉల్లిపాయల విషయంలో నోరు జారిన లోకేష్ కు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు విజయసాయి రెడ్డి. “వందకు చేరిన ఉల్లిపాయల్ని జగన్ గారి ప్రభుత్వం కిలో 25కు విక్రయిస్తుంటే చిట్టి నాయుడు తట్టుకోలేక పోతున్నాడు. ఆధార్, రేషన్ కార్డులు చూపిస్తేనే ఇవ్వడమేమిటి, అవి లేకున్నా అమ్మాలి అని సలహా ఇస్తున్నాడు. తక్కువ ధరకు కొనుగోలు చేసి తన హెరిటేజ్‌కు తరలించాలనే ప్లాన్ కాబోలు” అని చెప్పారు.
