చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అదిగో ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అద్భుతమైన నగరం..సింగపూర్‌ను తలదన్నే ప్రపంచస్థాయి నగరం, టోక్యో, లండన్, ఇఫ్టాంబుల్, షాంఘై నగరాలు కూడా అమరావతికి సాటి రావనేలా గ్రాఫిక్స్ చూపించి మభ్యపెట్టాడు..మూడు పంటలు పండే సారవంతమైన భూములను రైతుల దగ్గర లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి పచ్చ నేతలకు, అదీ తన సామాజికవర్గ నేతలకు దోచిపెట్టాడని ఆరోపణలు ఉన్నాయి. ఐదేళ్లలో బాబుగారు కట్టింది నాలుగే నాలుగు టెంపరరీ బిల్డింగ్‌లు..అవి కూడా చిన్నవర్షానికే కురిసే భవనాలు..కనీసం టాయిలెట్ సౌకర్యాలు కూడా లేవు. ఇక అమరావతిలో ఇప్పటి వరకూ సరైన రోడ్డు లేదు..అమరావతిలో జరిగిన మోసం గ్రహించిన రైతులు రాజధాని ప్రాంతంలో టీడీపీని చిత్తుగా ఓడించారు. ఆఖరికి నారావారి పుత్రరత్నం లోకేష్‌ను కూడా ఇంట్లో కూర్చోపెట్టారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ రాజధానిలో బాబు చేసిన తప్పును చేయకూడని నిర్ణయించారు. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మేరకు బాబు తరహాలో దుబారా చేయకుండా వాస్తవిక దృక్పథంతో రాజధాని విషయంలో ఆచితూచి అడుగువేస్తున్నారు. సింగపూర్ కన్సార్షియంతో బాబు చేసుకున్న ఒప్పందంలో లొసుగులు ఉన్నాయని గ్రహించిన ప్రభుత్వం నిలదీసేసరికి సదరు సింగపూర్ కంపెనీలు వెనక్కి పోయాయి. దీంతో చంద్రబాబు ప్రభుత్వం అసమర్థత వల్లనే సింగపూర్ కంపెనీలు వెనక్కిపోయాడని గగ్గోలు పెడుతున్నాడు. తాజాగా అమరావతిలో చంద్రబాబు పర్యటించబోతున్నాడు. అయితే రాజధానిలో అడుగుపెట్టిన బాబుగారికి ఘోర అవమానం ఎదురైంది. ‘చంద్రబాబు మరోసారి మా జీవితాలతో ఆడుకోవద్దు’అంటూ తీవ్ర వ్యాఖ్యలతో బాబు ఫొటో పెట్టి భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బాబు సర్కార్ రాజధానిలో పేరుతో తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాలకు చెందిన 28054 మంది రైతుల నుంచి 34 వేల ఎకరాలను ల్యాండ్‌పూలింగ్ ద్వారా సేకరించింది. అప్పుడు చంద్రబాబు భూములు ఇచ్చిన రైతులకు అరచేతిలో స్వర్గం చూపాడు. ఉచితంగా ఫ్లాట్లు, ఇండ్లు, ఉచిత విద్య, ఉచిత వైద్యం, యువతకు ఉద్యోగాలు, కూలీలకు ఉపాధి అంటూ అనేక హామీలు ఇచ్చాడు. అయితే ఇప్పటివరకు రాజధాని రైతులకు ప్లాట్లు కూడా కేటాయించలేదు. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న రాజధాని రైతులు బాబు రాకను వ్యతిరేకిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రశ్నల వర్షం కురిపించారు. రాజధాని పేరుతో గ్రాఫిక్స్ తో రంగుల కల చూపించి మమ్మల్ని మోసం చేసిన చంద్రబాబు ముందు క్షమాపణ చెప్పిన తర్వాతే రాజధానిలో అడుగుపెట్టాలని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కృష్ణానది కరకట్ట నుంచి రాయపూడి వరకూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ రోజు అమరావతిలో అడుగుపెడుతున్న చంద్రబాబుకు ఎక్కడ చూసినా ఈ ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. దీంతో రాజధాని పేరుతో రాజకీయం చేద్దామని వచ్చిన చంద్రబాబుకు ఘోర అవమానం ఎదురయినట్లైంది.