అమరావతిలో పర్యటిస్తున్న చంద్రబాబుకు అడుగడుగునా రైతుల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. ఈ రోజు ఉదయం నల్ల జెండాలు, పోస్టర్లతో చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకుని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై తెలుగు తమ్ముళ్లు దాడులకు తెగబడ్డారు. టీడీపీ నేతల దాడులపై రాజధాని ఆగ్రహం వ్యక్తం చేసిన రాజధాని రైతులు చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్థం చేశారు. రాజధాని పేరుతో అందరికీ ప్లాట్లు, ఇంటికో ఉద్యోగం, ఉచిత వైద్యం, ఉచిత విద్య అందిస్తానని చెప్పి భూములు లాక్కున చంద్రబాబు ఐదేళ్లలో కనీసం తమకు కి ప్లాట్లు కూడా ఇవ్వకుండా అన్యాయం చేశారని రైతులు మండిపడ్డారు. తమకు జరిగిన అన్యాయాన్ని నిలదీయడానికి వస్తే చంద్రబాబు గుంటూరు నుంచి రౌడీలను తీసుకువచ్చి తమపై దాడి చేయించారంటూ రైతన్నలు ఫైర్ అయ్యారు. రాజధానికి భూములు ఇచ్చినందుకు ప్రతిఫలంగా చంద్రబాబు తన పార్టీ కార్యకర్తలతో తమపై దాడులు చేయించాడని రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న తమపై టీడీపీ కార్యకర్తల దాడులకు నిరసనగా చంద్రబాబు దిష్టి బొమ్మను దగ్ధం చేస్తున్నట్లు రాజధాని రైతులు తెలిపారు. తమకు అన్యాయం చేసిన బాబుకు కచ్చితంగా బుద్ధి చెబుతామని రైతన్నలు హెచ్చరించారు. మొత్తంగా అమరావతిలో తీవ్ర ఉద్రిక్తతల నడుమ చంద్రబాబు పర్యటన సాగుతోంది.
