ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ బోపాల్ బీజేపి ఎంపి, ఎప్పడు వివాదాస్పవ వాఖ్యలు చేస్తు వివాదాలను తెచ్చుకుంటుంది. బుధవారం కూడా లోక్ సభలో గాడ్ సే దేశభక్తుడని ఆమె చెప్పడంతో విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ప్రజ్ఞా ఠాకూర్ వాఖ్యలను బిజేపి పార్టీ నాయకులు ఖండించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఠాకూర్ వాఖ్యల పై దేశవ్యాప్తంగా నిరసనలు రావడంతో బిజేపీ పార్టీ స్పందించింది.
వివాదస్పద వాఖ్యలు చేసిన ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ పై బిజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపి నడ్డా స్పందించారు.లోక్ సభలో తమ పార్టీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ చేసిన వాఖ్యలను ఖండిస్తున్నట్టు,ఆమె ప్రకటనకు మద్దతు ఇవ్వమని బిజేపి పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇటీవల తనను నియమించిన రక్షణశాఖ సంప్రదింపుల కమిటీ నుంచి ఆమెను తొలగించాలని సిఫారసు చేసినట్టు కూడా జేపి నడ్డా తెలిపారు. ఈ సెషన్ లో బిజేపీ పార్లమెంటరీ సమావేశాలకు ఠాకూర్ హాజరుకావద్దని నిర్ణయం తీసుకున్నట్టు బిజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పష్టం చేశారు.