ఏపీ రాజధాని అమరావతిలో చంద్రబాబు పర్యటన తీవ్ర ఉద్రిక్తతల నడుమ కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం అమరావతిలో పర్యటిస్తున్న చంద్రబాబు కాన్వాయ్‌పై ఇద్దరు వ్యక్తులు చెప్పులు, రాళ్లు విసిరారు. దీంతో వారిపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. చంద్రబాబుపై చెప్పులు, రాళ్లతో చేసిన దాడిపై రాజకీయంగా పెను దుమారం చెలరేగడంతో డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. బాబు కాన్వాయ్‌పై చెప్పులు, రాళ్లు విసిరిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సవాంగ్ తెలిపారు. ఈ ఇద్దరి చెప్పులు విసిరిన వ్యక్తి రాజధానికి చెందిన రైతు కాగా..రాళ్లు విసిరిన వ్యక్తి..ఓ రియల్టర్ అని డీజీపీ వివరించారు. చంద్రబాబు వల్ల తమకు అన్యాయం జరిగింది కాబట్టే..తాము ఈ దాడికి పాల్పడ్డామని సదరు వ్యక్తులు తెలిపినట్లు సవాంగ్ చెప్పారు. ప్రతి ఒక్కరికీ భావప్రకటనా స్వేచ్ఛ ఉంటుందని, అలాగే నిరసన వ్యక్తం చేసే హక్కు ఉంటుందని డీజీపీ అన్నారు. ఇలాంటి సందర్భాల్లో పోలీసులను తప్పుపట్టడం సహజమేనని ఆయన అన్నారు. మొన్న పల్నాడు ఇష్యూ చూశారు..పోలీసులపై తీవ్ర విమర్శలు చేశారని సవాంగ్ గుర్తు చేశారు. మా విచారణలో వివాదాలు జరగవని తేలింది కాబట్టే..రాజధానిలో బాబు పర్యటనకు అనుమతి ఇచ్చామని..అలాగే ఎలాంటి సెక్షన్లు పెట్టలేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. మొత్తంగా చంద్రబాబు కాన్వాయ్‌పై చెప్పులు, రాళ్లు విసిరింది వైసీపీ కార్యకర్తలే అంటూ ఇష్టానుసారంగా నోరుపారేసుకున్న టీడీపీ నేతలకు, ఎల్లోమీడియా ఛానళ్లకు..డీజీపీ సవాంగ్ ప్రకటనతో నోరు మూతపడినట్లయింది.
