దాదాపు యాబై మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేయడానికి పిలుపునిచ్చి.. ఆ తర్వాత సమ్మె విరమించమని చెప్పిన తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది.
అందులో భాగంగా అశ్వత్థామరెడ్డి తన ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ పదవీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. తమ డిమాండ్ల పరిష్కారానికి సమ్మె చేసిన ఆర్టీసీ సిబ్బందికి నేతృత్వం వహించిన ఆయన సమ్మె నిర్వహాణలో… విరమణలో ఏకపక్షంగా వ్యవహారించారు అని విమర్శలు వచ్చాయి.
అంతేకాకుండా సమ్మెకాలంలో రాజకీయ విమర్శలు చేశారు. తన సొంత లభ్ధి కోసం ఆర్టీసీ సిబ్బందిని రోడ్డుపై పడేశాడని ఆరోపణలు ఎదుర్కుంటున్న ఆయన ఈ నిర్ణయం తీసుకోనున్నారు సమాచారం.