Home / ANDHRAPRADESH / అమరావతిలో బాబు కాన్వాయ్‌పై దాడి..ఏపీ మంత్రి కొడాలి నాని క్లారిటీ..!

అమరావతిలో బాబు కాన్వాయ్‌పై దాడి..ఏపీ మంత్రి కొడాలి నాని క్లారిటీ..!

ఏపీ రాజధాని అమరావతిలో పర్యటిస్తున్న చంద్రబాబు కాన్వాయ్‌పై జరిగిన దాడిని టీడీపీ రాజకీయం చేస్తోంది. వైసీపీ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని, చంద్రబాబు, లోకేష్‌తో సహా టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఏపీ మంత్రి కొడాలి నాని స్పందించారు. ఓ మీడియా ఛానల్‌‌తో మాట్లాడుతూ..చంద్రబాబు నాయుడిని అడ్డుకోవాలంటే అమరావతిలో అడ్డుకోవాలా..నిన్న కడప వెళ్లివచ్చాడు..చింతకాయ కొట్టుడు కొట్టేవారు…కాబట్టి చంద్రబాబును అడ్డుకోవాలంటే ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఫుట్‌బాల్ ఆడుకుంటాం..అయితే ఎవరిని అడ్డుకోవాలన్న ఉద్దేశ్యం మా ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గతంలో రాజధానిలో 33 వేల ఎకరాలు పొలాలు తీసుకుని, గ్రాఫిక్స్, సింగపూర్, అంతర్జాతీయం, జాతీయం అంటూ సర్వనాశనం చేశాడన్న ఉద్దేశ్యం అక్కడి రైతుల్లో ఉంది..అదే విధంగా రాజధానిలో అసైన్డ్‌ ల్యాండ్స్ ఉన్నాయి..అక్కడి రైతులకు ముందేమి చెప్పకుండా..బాబు బినామీలతో కొనుగోలు చేయించి..తర్వాత వాళ్లకు ప్యాకేజీ మమ్మల్ని దారుణంగా మోసం చేశాడన్న బాధ అసైన్డ్ రైతుల్లో ఉంది. కాబట్టి చెప్పులు, రాళ్లు వేసి చంద్రబాబుకు నిరసన తెలిపారని మంత్రి అన్నారు. బాబుపై దాడికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని..ఆడుకోవాలి..కొట్టాలి..తన్నాలి అనుకుంటే..చంద్రబాబును 13 జిల్లాలోను కొడతారు..తిడతారు..రాళ్లు, చెప్పులు విసురుతారు…కాని అమరావతిలో రైతులను ముంచాడు కాబట్టే..వాళ్లు చంద్రబాబుకు నిరసన తెలిపారని మంత్రి అన్నారు. ఇక బాబు కాన్వాయ్‌పై జరిగిన దాడిపై లోకేష్ స్పందిస్తూ..నిరసన తెలిపింది స్థానికంగా ఉన్న రైతులు కాదని..తెనాలి నుంచి కొంతమంది వైసీపీ వాళ్లు తీసుకువచ్చారంటూ విమర్శలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై కొడాలి నాని మండిపడ్డారు. లోకేష్ బ్యాచే తెనాలి బ్యాచ్ ఉండి ఉంటారక్కడ..నీది తెనాలి..నాది తెనాలి అని..అక్కడ తెనాలి బ్యాచ్ ఉంటారు కాబట్టి..పొద్దుటి నుంచి సాయంత్రం దాకా తెనాలి తెనాలి అంటాడని ఎద్దేవా చేశారు. లోకేష్ పక్కనే తెనాలి బ్యాచ్ ఉంటారు కాబట్టి బాబు కాన్వాయ్‌పై దాడి విషయం లోకేష్ తెనాలి బ్యాచ్‌కే తెలియాలని మంత్రి కొడాలి నాని సెటైర్ వేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat