శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీ సమక్షంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఛత్రపతి శివాజీ, తల్లిదండ్రులను స్మరిస్తూ దైవసాక్షిగా ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణం చేశారు. దాదర్ లోని ప్రఖ్యాత శివాజీ పార్కులో జరిగిన ప్రమాణస్వీకార మహోత్సవానికి ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రేతోపాటు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, ఆ పార్టీ నేత టీఆర్ బాలు, కాంగ్రెస్ నేతలు అహ్మద్‌పటేల్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఆ పార్టీ నేతలు అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, సుప్రియాసూలే సహా ఆయా పార్టీలకు చెందిన పలువురు సీనియర్ నేతలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అంతకుముందు జాతీయగీతాలాపనతో ప్రమాణస్వీకార కార్యక్రమం ప్రారంభమైంది.
#WATCH Uddhav Thackeray takes oath as Chief Minister of Maharashtra. #Mumbai pic.twitter.com/pKaAjqYvWM
— ANI (@ANI) November 28, 2019