ఒక హీరో అభిమాని అంటే మూవీ రీలీజ్ ఫస్ట్ డే నాడు ఫస్ట్ షో చూస్తాడు. లేదా ఫ్లెక్సీలు పెడతాడు.. లేదా సినిమా విడుదల రోజు తమ అభిమాన హీరో కటౌటుకు పాలాభిషేకం చేస్తారు.. లేదా తమ అభిమాన హీరో పుట్టిన రోజునాడు రక్తదానమో.. అన్నదానమో.. లేదా ఆసుపత్రులల్లో.. అనాధ ఆశ్రమాల్లో పూలు పండ్లు పంచుతారు. కానీ ఈ అభిమాని అభిమానులందే వేరయా అన్పించుకున్నాడు.
ఇంతకూ ఇతను ఎవరి అభిమాని అనుకుంటున్నారు.. అక్కినేని వారసుడు అక్కినేని నాగచైతన్య అభిమాని అయిన సాగర్ తన అభిమాన హీరో నాగచైతన్య పుట్టిన రోజు అయిన నవంబర్ 23న పురస్కరించుకుని సింహాచలం ఆలయంలోని వెయ్యి మెట్లు మోకాళ్లతో ఎక్కాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అక్కినేని సమంత,హీరో నాగచైతన్య వరకు చేరింది.
దీంతో వీరిద్దరూ” సాగర్ నువ్వు చూపిస్తున్న అభిమానానికి మాటల్లేవు. నీలాంటి అభిమానులున్నందుకు చాలా గర్వంగా ఉంది. వచ్చి ఒక్కసారి వచ్చి కలువు”అని ట్వీటు చేశారు. అయితే సాగర్ వెయ్యి మెట్లు మోకాళ్లపై ఎక్కడాన్ని నెటిజన్లు తప్పు పడుతున్నారు. ఇదేదో ఇంటి వాళ్లకోసమో.. కన్నవాళ్లకోసమో చేస్తే కాస్త పుణ్యముంటుంది. సినిమా వాళ్ల కోసం చేస్తే ఏమోస్తాది నీ బొంద. నీ అభిమానం తగలెయ్యా అని సెటైర్లు వేస్తోన్నారు.