అర్జున్ రెడ్డి మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన యంగ్ అండ్ డ్యాషింగ్ హీరో విజయ్ దేవరకొండ. వరుస సినిమాలతోనే కాకుండా వరుస విజయాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న క్రేజీ హీరో విజయ్ .
తాజాగా విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో నటిస్తున్నాడు. అయితే ఇప్పటివరకు తన కుటుంబంతో సహా హైదరాబాద్ మహానగరంలో శ్రీనగర్ కాలనీలో ఉన్న విజయ్ దేవరకొండ ఈ మధ్య సీనియర్ నటుడు శ్రీకాంత్ ఇంటి పక్కన కొన్న ఒక కొత్త ఇంట్లోకి అడుగుపెట్టాడు.
అయితే మొన్ననే తన కుటుంబసమేతంగా విజయ్ అ ఇంట్లోకి అడుగుపెట్టాడు. మరి ఈ ఇల్లు ఖరీదు ఎంత ఉంటుందో తెలుసా.. అక్షరాల రూ. ఇరవై కోట్ల వరకు ఉంటుందని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.