తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు టీటీడీ శుభవార్తను తెలిపింది. ప్రస్తుతం నెలకొన్న భక్తుల తాకిడి దృష్ట్యా వైకుంఠ ద్వార మహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వైకుంఠ ద్వారాన్ని దాదాపు పది రోజుల వరకు తెరిచే ఉంచాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది.
ఈ క్రమంలో ఆగమ సలహా మండలి కూడా అనుమతివ్వడంతో త్వరలోనే దీన్ని టీటీడీ అమలు చేయనున్నది. ప్రస్తుతం వైకుంఠ ఏకాదశి,ద్వాదశి పర్వదినం రోజుల్లోనే భక్తులను వైకుంఠ ద్వారం గుండా అనుమతిస్తున్నారు.