రష్మిక మందన్న…టాలీవుడ్ లో ఛలో సినిమాతో అడుగుపెట్టిన ఈ కన్నడ భామ. మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని అందరి మైండ్ లో పడింది. ఆ తరువాత గీత గోవిందం సినిమాతో ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగిపోయింది. అనంతరం రెండు చిత్రాలు అంతగా బాగోపోయిన తన క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఈ ముదుగుమ్మ చేతిలో మూడు సినిమాలో ఉన్నాయి. సరిలేరు నీకెవ్వరు, భీష్మ, అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ వచ్చే సినిమాలో నటిస్తుంది. ఇవన్నీ ప్రేక్షకుల ముందుకు వస్తే తానే టాప్ అని చెప్పాలి. ఇంక ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ ముదుగుమ్మకు ఒక పెద్ద ఆఫర్ వచ్చింది. తెలుగులో వచ్చిన జెర్సీ చిత్రాని షహీద్ కపూర్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా ఆమెను అడగగా డేట్స్ కాలిలేకపోవడంతో ఛాన్స్ వదులుకుంది. ఇదేగాని ఓకే చెప్పి ఉంటే ఇదే తనకి పెద్ద సినిమా అయ్యి ఉండేది.