గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేస్తారని.. దేశానికి రెండో రాజధాని చేస్తారని తీవ్రంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రెండో జాతీయ రాజధాని అంశంపై కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది.
బుధవారం రాజ్యసభలో ఈ అంశాన్ని కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ ప్రస్తావించారు. ఈ ప్రశ్నకు హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దక్షిణ భారతదేశంలో రెండో జాతీయ రాజధాని ఏర్పాటు అంశం పరిశీలనలో లేదని వెల్లడించారు. కాగా ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.